Kuthanthram Lyrics – MC Hari
Singer | MC Hari |
Composer | Sushin Shyam |
Music | Sushin Shyam |
Song Writer | Sushin Shyam |
Lyrics
Kuthanthram Telugu Song Lyrics in Telugu
చెమట కంపు కొట్టె చొక్కాలు
రంగు వెలిసి పోవటం ఇంక అసాధ్యం
కలల్లో కట్టుకున్న కోటల్లో
ఇంక రాజు మంత్రి నువ్వే నీ రాజ్యం
కాలు భూమి మీద నిలవదు మనకు
పిచ్చ ఊపుతోటి పిట్టలాగ ఉరుకు
బురద తామరల్లే కలిసి మెలిసి బతుకు
తిండి పెట్టమన్న తోడుండే వరకు
మంచి చెడ్డలన్ని మారిన చోట
కూటి చేతులలో పూదోట
పొట్టకూటికే నీ ఈ వేట
రెక్కలాడకుంటే గడవదు పూట
పిచ్చుకల్లే నువ్వు కూడబెట్టమిట్టమల్లె
డేగలాగ వాడు కన్నుగప్పి తన్నుకెళ్ళే
చెయ్యి జారిందంటే నీటిలోని చేపపిల్లే
చిక్కదంట నీకు అది ఇక భ్రమేలే
కుతంత్ర తంత్ర మంత్రమేమి తెలియదిక్కడ
తమాషాకైనా తాగి మాటజారలేదురా
కుతంత్ర తంత్ర మంత్రమేమి తెలియదిక్కడ
తమాషాకైనా తాగి మాటజారలేదురా ||2||
మండుటెండల్లోన కాయకష్టం చేసుకుంటం
మాపటేల దాటి కల్లు పాక చేరుకుంటం
తాగినాక మాకు బాధలన్నీ గుర్తుకొస్తే
అడ్డమొచ్చినోన్ని ఆడేసుకుంటం